తెరాస, కాంగ్రెస్, భాజపాలు... ఓవైసీ, ఎంఐఎం పేర్లను జపిస్తున్నాయని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మేము తప్ప వారికి ఎవరూ కనబడటం లేదని ఎద్దేవా చేశారు. నిర్మల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అదే పంథాలో మాట్లాడారని అన్నారు.
MIM: తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు: అసదుద్దీన్ ఓవైసీ - అధినేత అసదుద్దీన్ ఓవైసీ
తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్, భాజపాలు తమ ప్రచారాల్లో ఎంఐఎం పేరును జపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంలో తాము ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఓవైసీ తెలిపారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మైనార్టీలకు నమ్మకం, భరోసా ఇవ్వాలన్నారు. అంతే కానీ భయపెట్టే మాటలతో ప్రజలు రెచ్చగొట్టడాన్ని ఆయన ఖండించారు. రాడికలిజం గురించి మాట్లాడే భాజపా దిల్లీ, కాన్పూర్లో ముస్లిం వ్యక్తులపై జరిగిన సామూహిక దాడులను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. తాలిబన్ నాయకులకు ట్రావెలింగ్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న అమెరికా విధానాన్ని భారత్ అనుసరిస్తుందా లేదా వారిని తీవ్రవాద నిషేధ జాబితాలోనే కొనసాగిస్తుందా స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోదీని ఓవైసీ ప్రశ్నించారు.
ఇదీ చూడండి:Ganesh immersion: గణేశ్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు