కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలతో పార్లమెంటును తప్పుదోవ పట్టించిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఎలాంటి కార్యాచరణ లేకుండా భారీ వృద్ధి రేటు లక్ష్యాలు ఎలా నిర్దేశించుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్ వల్ల వాళ్లకే లాభం: అసదుద్దీన్ - అసదుద్దీన్ ఒవైసీ
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ పద్దులో విదేశీయులకు, కార్పొరేట్‌కు పెద్దపీట వేశారని విమర్శించారు.
mim mp asaduddin owaisi