కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. కేంద్రం వాళ్లను స్వస్థలాలకు చేర్చాలన్న ఆదేశాల మేరకు రైల్యే అధికారులు కార్మికులను ప్రత్యేక రైళ్లలో తరలిస్తున్నారు.
వలస కూలీలతో బయలుదేరిన రైలు
లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లింగంపల్లి నుంచి మధ్యప్రదేశ్‌లోని రాంచీ వరకు ఒక రైలు వలస కూలీలతో బయలుదేరింది.
వలస కూలీలతో బయలుదేరిన రైలు
హైదరాబాద్ లింగంపల్లి నుంచి కాగజ్ నగర్ మీదుగా మధ్యప్రదేశ్‌లోని రాంచీ వరకు ఒక రైలు వలస కూలీలతో బయలుదేరింది. లాక్‌డౌన్ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడిన కూలీలకు.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉపశమనాన్ని కలిగించింది. రైల్వే శాఖ లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం మొదటిసారిగా కూలీలను తరలించేందుకు ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది.