హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు తెలిపారు. ఎల్బీ నగర్లో ప్లాట్ ఫామ్, ఎలివేటర్, సెక్యూరిటీ చెక్ వద్ద క్యూలో అధిక సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు. 15 నుంచి 20 నిమిషాల పాటు ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మెట్రో రైళ్లు ఆలస్యం... కారణం అదేనా?
హైదరాబాద్లోని మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు.
మెట్రో రైళ్లు ఆలస్యం... సాంకేతిక కారణాలే!
సాంకేతిక కారణాలతోనే ఆలస్యం అవుతోందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. ప్లాట్ ఫామ్ వద్ద ఎక్కువ మంది ఉండకుండా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి:మీసేవల ముందు పడిగాపులు... క్యూలైన్లలో పడరాని పాట్లు