తెలంగాణ

telangana

ETV Bharat / state

metro timings hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్​న్యూస్​..నేటి నుంచి ఆరు గంటలకే..

metro-services-will-start-from-6-am-tomorrow-in-hyderabad
metro-services-will-start-from-6-am-tomorrow-in-hyderabad

By

Published : Nov 9, 2021, 3:54 PM IST

Updated : Nov 10, 2021, 4:24 AM IST

15:49 November 09

మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌ మెట్రో(metro timings hyderabad) ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచే తొలి మెట్రో రైలు(metro timings hyderabad) ప్రారంభం కానుంది. ఈ మేరకు సమయాల్లో హైదరాబాద్‌ మెట్రోరైల్‌-హెచ్​ఎంఆర్(metro timings hyderabad) మార్పులు చేసింది.  ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి కేటీఆర్(minister ktr on metro timings) ఆదేశాలతో మెట్రో సేవలు పొడిగిస్తూ హెచ్​ఎంఆర్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయల్దేరి.. రాత్రి 11.15 గంటలకు చివరి మెట్రో రైలు గమ్యస్థానానికి చేరుకోనుంది.  

సోమవారం ఓ మెట్రో ప్రయాణికుడు రైళ్లు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతున్నాయని ట్వీట్‌ చేశారు. దానివల్ల 6 గంటలకే ప్రయాణించేందుకు వెసులుబాటు లేకుండా పోయిందన్నారు. ఆ సమయానికి వెళ్లాలనుకుంటే క్యాబ్‌ల ధరలు కూడా అధికంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గంటపాటు మెట్రోస్టేషన్‌లలో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. నగరవాసి ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్(ktr about metro timings) సమయపాలనపై దృష్టిపెట్టాలని సూచిస్తూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సూచించారు. మంత్రి సూచనతో ఉదయం 6 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభిస్తున్నామని హెచ్​ఎంఆర్ ప్రకటించింది.

ఇదీ చదవండి:Srinivas Goud: నూతన మద్యం పాలసీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్​ క్లారిటీ...

Last Updated : Nov 10, 2021, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details