హైదరాబాద్ మెట్రోభవన్‌లో పేటీఎం క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్ కొనుగోలు విధానాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సౌకర్యంతో టికెట్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం రోజూ నాలుగు లక్షల మంది మెట్రో ప్రయాణికుల్లో... అరవై వేల మంది క్యూ ఆర్ కోడ్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
మెట్రోలో కరోనా భయం లేదు... - hyderabad latest news
హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యం తీసుకొచ్చింది. మెట్రో భవన్లో పేటీఎం క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్ కొనుగోలు విధానాన్ని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడంలో.. హైదరాబాద్ మెట్రో ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
మెట్రోలో పేటీఎం క్యూఆర్‌కోడ్
మెట్రోలో ప్రయాణించే వారు కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు తాకే ప్రతి చోట ఆర్దో కెమికల్ శానిటైజర్లతో శుభ్రపరుస్తూ.. శానిటేషన్ చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి భయం లేకుండా మెట్రోలో ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:కరోనా నివారణకు మెట్రో నివారణ చర్యలు
Last Updated : Mar 5, 2020, 10:41 PM IST