తెలంగాణ

telangana

ETV Bharat / state

'త్వరలోనే శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు మెట్రో సేవలు' - Expansion

ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రాగానే మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దాదాపు రూ. 5వేల కోట్లతో పనులు చేయనున్నట్లు చెప్పారు.

Metro train

By

Published : Aug 16, 2019, 4:21 PM IST


ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రాగానేత్వరలోనేమైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్​కి 31 కిలో మీటర్ల దూరాన్ని రూ. 5 వేల కోట్లతో పనులు చేయనున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు పనులు చివరి దశలో ఉన్నాయని.. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. హైటెక్ సిటీ రివర్సల్ సౌకర్యం పూర్తయిందని... భద్రత అనుమతులు వచ్చాకా నాలుగైదు రోజుల్లోనే ట్విన్ సింగిల్ లైన్ విధానం అమలు చేస్తామన్నారు. దీని వల్ల హైటెక్ సిటీ నుంచి-జూబ్లిచెక్ పోస్ట్ వరకు అవసరాన్ని బట్టి మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ 3, 5 నిమిషాల వరకు కుదించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14 తేదీన ఒక్క రోజే మెట్రోలో అత్యధికంగా 3 లక్షల 6వేల మంది ప్రయాణం చేశారని ఎన్వీఎస్​ రెడ్డి వివరించారు.

'త్వరలోనే శంషాబాద్​ మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తాం'

ABOUT THE AUTHOR

...view details