జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లు కీలకమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ కార్యాలయంలోని సమావేశమందిరంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిప్యూటీ కమిషనర్లు అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే కీలక బాధ్యత: ఎస్ఈసీ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్ల మీదే ప్రధాన బాధ్యత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. ప్రతి సర్కిల్‌లోని అన్ని వార్డులకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందన్నారు.
ఈ నెల 13న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. త్వరలో పోలింగ్ కేంద్రాల ప్రచురణకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఓటర్లకు అభ్యర్థులకు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయంలో 24గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఓటర్లందరికి ఓటరు స్లిప్పులను సంబంధిత బీఎల్‌వో ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహా రెడ్డి, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: గంగుల