Paddy Committee: యాసంగి వడ్ల కొనుగోళ్ల అంశంపై ఏర్పాటైన కమిటీ సమావేశమైంది. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. విధివిధానాలు, మిల్లర్ల సమస్యలు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో బీఆర్కే భవన్లో కమిటీ ఇవాళ సమావేశమైంది.
Paddy Committee: యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ - ts news
Paddy Committee: యాసంగి వడ్ల కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్సీఐకి అందించే ధాన్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
Paddy Committee: యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ
ఆర్థిక, నీటిపారుదలశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్సీఐకి అందించే ధాన్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముడిబియ్యంగా మార్చే క్రమంలో ఎక్కువగా వచ్చే నూకలు, అయ్యే నష్టం, మిల్లర్లకు ఇవ్వాల్సిన మొత్తం, మిల్లర్ల విజ్ఞప్తులు, తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
ఇవీ చదవండి: