ప్ర. రోజువారి వినియోగించే ఔషధాలు ఏంటి? అవి అందుబాటులో ఉన్నాయా?
జ.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఔషధాలు వాడాల్సిన అవసరము కచ్చితంగా ఉంది. కిడ్నీకి, డయాలసిస్, బీపీ, కేన్సర్, గైనిక్ వంటి తదితర సమ్యలకు రోజూవారి మందులు వాడాల్సిందే. ప్రస్తుతం అవి మనకు అందుబాటులో ఉన్నాయి.
ప్ర. ఔషధాల లభ్యత ఎంత శాతం ఉంది?
జ.ఇంత వరకు అన్ని రాష్ట్రాల నుంచి 100 శాతం ఔషాధాలు వచ్చేవి. ప్రస్తుతం తెలంగాణకు 20 లారీలు వస్తున్నాయి.
ప్ర. లాక్‌డౌన్‌కు ముందు... ఆ తర్వాత మందుల సరఫరాలో ఎలాంటి వ్యత్యాసం ఉంది?
జ. చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలు మెడిసిన్ లేదని అనుకోవడం వల్ల 75 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా మందుల సరఫరా కూడా ఆలస్యమవుతోంది. దీంతో మందుల కొరత ఏర్పడుతోంది.
ప్ర. సరఫరా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మెడిసన్ ఆగిపోతుందా? లేదా హోల్‌సేల్ మెడికల్ షాప్‌లకు చేరడంలో ఆగిపోతుందా?
జ.లాక్‌డౌన్ కారణంగా ఉత్పత్తికన్నా పంపిణీలోనే ఆలస్యం అవుతోంది. సప్లయి చేయడానికి మనుషులు లేరు. బిల్లింగ్ చేయడానికి ఉద్యోగులు లేరు.
ప్ర. ఏమి చేస్తే తిరిగి ఔషధాల సరఫరా యథావిధిగా కొనసాగుతోంది?
జ.ఇప్పుడు మందుల అమ్మకాలు 25 శాతమే ఉన్నాయి. ఒక రకంగా ఇది ప్రభుత్వానికి కూడా నష్టమే. మద్యం దుకాణాలు తెరిచినట్లు మందుల దుకాణలు తెరిచి... అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఈ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలి. వీటి మధ్య సమన్వయం చాలా అవసరం. రవాణా త్వరగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
'ఔషధాల ఉత్పత్తికన్నా... పంపిణీలోనే ఆలస్యమవుతోంది' ఇవీ చూడండి:'రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులపై మరింత నిఘా'