గ్రేటర్ వ్యాప్తంగా రద్దీ ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా రెండోరోజు పెద్ద ఎత్తున చెత్తను తొలగించారు. సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్లలో జరుగుతున్న పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతోన్న పలు పారిశుద్ధ్య పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా పరిశీలించారు. నాలుగు రోజులపాటు చెత్త తొలగించేందుకు ప్రారంభించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా.. రెండోరోజు మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున చెత్తను తొలగించారు.
పారిశుద్ధ్య పనులు
బిన్ ఫ్రీ ప్రక్రియలో చేపట్టిన చర్యల్లో భాగంగా.. చెత్త సేకరణ పాయింట్ల నుంచి చెత్తను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. తిరిగి చెత్త వేయకుండా ఆయా ప్రాంతాల్లో ముగ్గులు వేయిస్తున్నారు. త్వరితగతిన చెత్తను టిప్పర్‌లో వేసే విధంగా.. పాయింట్ల వద్ద ప్లాస్టిక్ బ్యాగులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఝార్ఖండ్‌లో లాక్డౌన్- దేశవ్యాప్తంగా కఠిన చర్యలు