కరోనా మహమ్మారి వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నారని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. చిన్న వ్యాపారులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెట్వర్త్ హైదరాబాద్ బిజినెస్ గ్రూపు స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన ట్రెజర్ హంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ హాజరయ్యారు. నెక్లెస్ రోడ్డు నుంచి శామీర్పేట్ వరకు నిర్వహించిన కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
చిన్న వ్యాపారులకు అండగా నిలవడం అవసరం: మేయర్
కరోనా వైరస్ చిన్న, మధ్యతరగతి వ్యాపారాలను కోలుకోలేని దెబ్బ తీసిందని మేయర్ విజయలక్ష్మి అన్నారు. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. నెట్వర్త్ హైదరాబాద్ నిర్వహించిన ట్రేజర్ హంట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
చిన్న వ్యాపారులకు అండగా నిలవడం అవసరం: మేయర్ విజయలక్ష్మి
మేయర్ స్వయంగా కారు నడుపుకుంటూ సరదగా కొంత దూరం ప్రయాణించారు. కొవిడ్ ప్రభావం తగ్గి వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఇలాంటి వారిని ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన నెట్వర్త్ హైదరాబాద్ బిజినెస్ గ్రూపును మేయర్ అభినందించారు.
ఇదీ చదవండి:భర్తకు సెల్ఫీ వీడియో పంపి భార్య ఆత్మహత్య