తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీజనల్ వ్యాధుల రహిత నగరంగా హైదరాబాద్​ నిలవాలి'

సీజనల్ వ్యాధులు దరిచేరకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. వ్యాధులను అరికట్టడానికి వారం రోజులపాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అడిక్‌మెట్‌లో మేయర్ ప్రారంభించారు.

mayor inaugurate special sanitation drive at adikmet hyderabad
సీజనల్‌ వ్యాధుల రహిత నగరంగా తీర్చిదిద్దాలి

By

Published : Jun 1, 2020, 4:03 PM IST

సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వారంరోజుల పాటు చెత్తను తొలగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ జోన్‌లోని అడిక్‌మెట్‌లో మేయర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కార్పొరేటర్లతో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు.

శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా జూన్‌ 8వ తేదీ వరకు నగరంలోని ప్రతి అంశంపై దృష్టి సారించాం. హైదరాబాద్‌ నగరాన్ని కరోనా, సీజనల్‌ వ్యాధుల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ విధిగా సహాకరించాలి. కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు కలిసి కట్టుగా ఉంటూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జూన్‌ 8వ తేదీ తర్వాత కూడా రోడ్లపై చెత్త వేసే వారిపై ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జరిమానాలు విధిస్తాం.- బొంతు రామ్మోహన్,మేయర్

సీజనల్‌ వ్యాధుల రహిత నగరంగా తీర్చిదిద్దాలి

ఇదీ చూడండి:రాజధానికి మళ్లీ వలసలు మొదలయ్యాయి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details