తెలంగాణ

telangana

గ్రేటర్‌లో టీకా సంసిద్ధతపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమీక్ష

గ్రేటర్​ హైదరాబాద్​లో టీకా సంసిద్ధతపై జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. టీకా కేంద్రానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులను మేయర్​ బొంతు రామ్మోహన్​ ఆదేశించారు. ప్రాథమిక పనులను 2021 జనవరి 10 లోపు పూర్తి చేయాలని సూచించారు.

By

Published : Dec 29, 2020, 4:57 AM IST

Published : Dec 29, 2020, 4:57 AM IST

Mayor Bontu Rammohan review on vaccine readiness in Greater hyderabad
గ్రేటర్‌లో టీకా సంసిద్ధతపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమీక్ష

గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో కొవిడ్-19 టీకా సంసిద్ధతపై.. జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులతో.. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్, ఆరోగ్యశాఖ అదనపు కమిషనర్ సంతోష్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఇమ్యునైజేషన్ అధికారులు హాజరయ్యారు. టీకా మొదటి దశలో లక్షమందికి వేసేందుకు.. పాఠశాలలు, టీకా కేంద్రానికి అనువైన కళాశాలలను.. వెయిటింగ్ హాల్, టీకా పరిశీలన గదులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

టీకా ప్రయోగం కోసం సుమారు 11 వందల కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. టీకా కేంద్రాల మ్యాపింగ్ కోసం ప్రాథమిక పనులను 2021 జనవరి 10 లోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వస్తుందని.. దశలవారీగా టీకాను అందిస్తామని తెలిపారు. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కారకులైన.. నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి .. 2వ దశలో పోలీస్, పురపాలక కార్మికులు.. మూడో దశలో 50 ఏళ్లు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తామని వివరించారు.

ఇదీ చూడండి:కరోనా స్ట్రెయిన్ పట్ల ఆందోళన అనవసరం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details