హరితహారం కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్‌లో 2 కోట్ల 50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ప్రజలంతా హరితహారం కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని మేయర్ సూచించారు. జూబ్లీహిల్స్‌లో విజయ నర్సరీలోని మొక్కలను మేయర్ పరిశీలించారు.
హరితహారం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మేయర్ రామ్మోహన్
ఆరో విడత హరితహారంలో భాగంగా హైదరాబాద్‌లో 2 కోట్ల 50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
హరితహారం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మేయర్ రామ్మోహన్
నగరంలోని ప్రతి వార్డులో గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులు, కార్పొరేటర్లకు సూచించారు. హెచ్ఎండీఏ నుంచి ఇతర ప్రైవేటు నర్సరీల నుంచి కూడా జీహెచ్ఎంసీ మొక్కలు కొనుగోలు చేస్తోందని.. రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ చేసి ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను చేపడతామని మేయర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్‌కు హైకోర్టు నోటీసులు