భారీ వర్షాలు, వరదలు తగ్గాలని హైదరాబాద్ పురానాపూల్ కమాన్ వద్ద మూసీ నదికి ప్రజాప్రతినిధులు శాంతిపూజ చేశారు. గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొని పూజలు నిర్వహించారు.
మూసీకి ప్రజాప్రతినిధుల పూజలు... పట్టువస్త్రాల సమర్పణ - మూసీనదికి పూజలు
పూరానాపూల్ కమాన్ వద్ద మూసీ నదికి... మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు శాంతి పూజ నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు తగ్గాలని పూజలు చేశారు. గంగమ్మకు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ పూలు సమర్పించారు.
మూసీ నదికి ప్రజాప్రతినిధులు పూజలు... పట్టువస్త్రాల సమర్పణ
1908లోనూ మూసీకి భారీ వరదలు వచ్చినప్పుడు నాటి పాలకులు ఈ విధంగా పూజలు చేశారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ... ప్రస్తుతం అమ్మవారికి పూజలు చేసినట్లు మంత్రి తలసాని వెల్లడించారు.