కార్మికులు వీరోచితంగా పోరాడి, రక్తం చిందించి... తమ హక్కులను సాధించిన రోజు మేడేను... హైదరాబాద్ వాడవాడలా ఎర్ర జెండాలను ఎగురవేసి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్లో మేడే సందర్బంగా రూపొందించిన గోడ పత్రికను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో కార్మికులు భౌతికదూరం పాటిస్తూ 135వ మేడే ఉత్సవాలను నిర్వహించాలని ఏఐటీయుసీ నాయకుడు నరసింహ కోరారు.
కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై శ్రమదోపిడీ: ఏఐటీయూసీ
హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్లో మేడే సందర్బంగా రూపొందించిన గోడ పత్రికను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో కార్మికులు భౌతికదూరం పాటిస్తూ 135వ మేడే ఉత్సవాలను నిర్వహించాలని ఏఐటీయుసీ నాయకుడు నరసింహ కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవరించి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వాలు అమలు చేయడంలేదని... కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేక నేడు కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ప్రైవేటీకరణను పెంచిపోషిస్తూ కార్పొరేట్ శక్తులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతరేకిస్తూ హక్కులు, సాంఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణకై మేడే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని నరసింహ కోరారు.