హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా రోగులకు మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, భాజపా హైదరాబాద్ అధ్యక్షుడు గౌతమ్ రావు, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు వినోద్ యాదవ్‌లు చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
కరోనా రోగులకు బిస్కెట్లు, మాస్కులు పంపిణీ - king koti hospital latest news
హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు... హైదరాబాద్ సెంట్రల్ జిల్లా భాజపా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, ఓబీసీ అధ్యక్షుడు వినోద్ యాదవ్‌లు మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు.
కరోనా రోగులకు బిస్కెట్లు, మాస్కులు పంపిణీ
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల అందరినీ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి బిల్లులను కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. అలాగే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరారు.