ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెంట రాజేశ్ దంపతులు కాళ్లు కడిగి కన్యాదానం చేసి వివాహాలు జరిపించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. మంత్రి నిరుపేద జంటలకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. పెళ్లి వేడుకలకు వచ్చిన వారందరికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సామూహిక వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి కొప్పుల
ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో 21 నిరుపేద జంటలకు అంగరంగ వైభవంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో వివాహాలు జరిగాయి. ఈ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు.
సామూహిక వివాహా వేడుకలో పాల్గొన్న మంత్రి కొప్పుల
ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశంసించారు. కొప్పుల ఈశ్వర్ నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఇవీ చూడండి:'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్'
Last Updated : Mar 24, 2019, 9:46 PM IST