తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్ క్యాంపస్​లో కల్యాణ మండపానికి డీజీపీ భూమిపూజ - marriage function hall in Yousufguda

పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్​గూడలోని మొదటి బెటాలియన్ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

marriage function hall at first betallian in Yousufguda Hyderabad
పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా కార్యక్రమాలు

By

Published : Mar 20, 2021, 3:20 PM IST

పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీస్ క్యాంపస్​లలో ఉన్న ఖాళీ స్థలాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని వెల్లడించారు. వీటితో పోలీసుల కుటుంబాలకు తక్కువ ఖర్చుకే మండపాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా కార్యక్రమాలు

హైదరాబాద్ యూసుఫ్​గూడలోని మొదటి బెటాలియన్​ ప్రాంగణంలో కల్యాణ మండప నిర్మాణానికి మహేందర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ పెళ్లి మండపాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసుల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details