పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటి తరలింపు రెట్టింపు చేయడాన్ని సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ వద్ద ఖండించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోరారు. రేపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు భేటీ అవుతున్నట్లు తెలిసిందని, ఆ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. సీఎంగా వైస్సార్ ఉన్నప్పుడు 11వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పోతిరెడ్డి పాడును 44 వేల క్యూసెక్కులకు పెంచే ప్రయత్నం చేస్తే... తాను, పీజేఆర్‌లు వ్యతిరేకించామని మర్రి గుర్తు చేశారు. అసలు పోతిరెడ్డిపాడు స్థితి ఏంటో... కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్‌ను 15 టీఎంసీల నీటిని తెలుగు గంగకు తరలించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారని వివరించారు. కానీ దానిని ఇప్పుడు 44 వేల నుంచి 88 వేల క్యూసెక్కులు తరలించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
'అప్పుడు వైఎస్‌ను అడ్డుకున్నాం.. కానీ ఇప్పుడు...'
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వద్ద నీటి తరలింపును రెట్టింపు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఖండించారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.
'పోతిరెడ్డిపాడు స్థితిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి'
Last Updated : Jan 12, 2020, 4:57 PM IST