అవసరమైతే కోర్టుకెక్కుతాం: మర్రి శశిధర్రెడ్డి - COLLECTOR
ఈవీఎంల ట్యాపరింగ్ వివాదాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టటం లేదు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా అధికారులపై ఒత్తిడి పెంచుతోంది.
అవసరమైతే కోర్టుకెక్కుతాం
నిబంధనలకు విరుద్ధంగా స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంలను తెరిచిన వికారాబాద్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేసింది. కలెక్టర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. అధికారులు చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
అవసరమైతే కోర్టుకెక్కుతాం