హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని బీసీ కులాల స్థితిగతులపై చర్చించారు.
మనిమంజరి నియామకం..
సదస్సులో భాగంగా బీసీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా మనిమంజరి సాగర్ నియామకమయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన శ్రీనివాస్ గౌడ్, మనిమంజరికి నియామక పత్రం అందజేశారు.
పోరాడి సాధించుకోవాలి..
బీసీలు సీట్ల కోసం కాకుండా కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మారారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని, అది పోరాడితే తప్ప రాదని బీసీ ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
బీసీ సీఎం వస్తేనే..
బీసీ కులాల విద్యార్థులు ఉచిత విద్య , వైద్య సౌకర్యాలు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆమె ఆకాంక్షించారు. బీసీ ముఖ్యమంత్రి వస్తే తప్ప బీసీ కులాల సమస్యలు తీరవని స్పష్టం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీ నాయకుడినే సీఎంగా ఎన్నుకుందామని బీసీ కులాలకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : గులాబీ వ్యూహాలు.. గ్రేటర్లో విజయానికి సరికొత్త అస్త్రాలు