Manik Rao Thackeray Incharge Telangana Congress: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రేను ఏఐసీసీ నియమించింది. మాణికం ఠాగూర్ స్థానంలో.. మాణిక్‌రావు ఠాక్రే కొనసాగనున్నారు. గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఉన్న మాణిక్‌రావు ఠాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు గోవా కాంగ్రెస్ బాధ్యతలను ఇచ్చారు. గతంలో మహారాష్ట్ర మంత్రిగా మాణిక్‌రావు ఠాక్రే పనిచేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే - Telangana Congress latest news
21:00 January 04
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే
అసలేం జరిగిదంటే: కొద్దిరోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ కాస్తా ఏఐసీసీకి చేరింది. దీనిపై స్పందించిన అధిష్ఠానం సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించింది. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రాష్ట్ర నాయకులతో విడివిడిగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమించడంపై పలువురు సీనియర్లు తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, సర్దుకుపోలేక సతమతమవుతూ వస్తున్నట్లు వారు తెలిపారు. దీనికితోడూ ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌పై సీనియర్ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తిగా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తాము ఏమి సూచనలు చేసే పరిస్థితి లేదని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి:TPCC వాట్సాప్ గ్రూప్ నుంచి మాణికం ఎగ్జిట్.. ఇన్‌ఛార్జ్‌గా తప్పుకున్నట్లేనా?
రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం.. భాజపా నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు