కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని యంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్ధాలుగా వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా... ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మేడారం వేదికగా యంఆర్‌పీఎస్ జాతీయ సమావేశాలు జరగుతాయని ప్రకటించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ - MANDAKRISHNA
కేంద్రప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ