తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్యాధికారమే.. మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యం : మందకృష్ణ మాదిగ

బహుజనులందరినీ ఏకం చేసి.. రాబోయే ఎన్నికల్లో తెరాస మీద రాజకీయ యుద్ధం చేయబోతున్నామని, దళితులకు, మహాజనులకు, బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. సికింద్రాబాద్​ లాలాపేట్​లోని కార్తీక గార్డెన్​లో వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

manda krishnamadiga met with vhps in secundrabad
రాజ్యాధికారమే.. మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యం : మందకృష్ణ మాదిగ

By

Published : Aug 24, 2020, 9:48 AM IST

సికింద్రాబాద్​ లాలాపేట్​లోని కార్తీక గార్డెన్​లో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధినేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. రాజ్యాధికారమే మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులందరిని కలుపుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా మహాజన సోషలిస్టు పార్టీ ముందుకు నడుస్తున్నదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

2023లో రాబోయే ఎన్నికల్లో 90% వర్గాలకు ప్రతినిధులుగా మహాజన సోషలిస్టు పార్టీ 10 శాతం ఉన్నత వర్గాలకు ప్రతినిధిగా ఉన్న టిఆర్ఎస్, ఇతర రాజకీయ వర్గాలకు యుద్ధం జరగబోతుందని ఆయన అన్నారు. దళితులు, బహుజనుల మద్ధతుతో మహాజన సోషలిస్టు పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే సీఎం అని అని చెప్పిన కేసీఆర్ మోసం చేశారన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యం దళితుడిని సీఎం చేయడమే అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ABOUT THE AUTHOR

...view details