ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా గుర్తిస్తే... దానిపై కూడా ముఖ్యమంత్రి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఛైర్మన్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐక్య వేదిక కన్వీనర్లు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, మహిళలు పాల్గొన్నారు. వైరస్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కొన్ని ఆమోదయోగ్యంగా... మారి కొన్ని ఆక్షేపనీయంగా ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు.
రెండు వందల నుంచి ఐదు వందల మంది జనసంద్రం ఉండే సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు మూసివేశారని... కానీ నిత్యం వేలాది మంది వచ్చి వెళ్లే వైన్స్ షాపులు ఎందుకు మూసివేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 20 వరకు కొనసాగాల్సిన అసెంబ్లీ సమావేశాలను మధ్యంతరంగా ఎందుకు వాయిదా వేశారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.