తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరివేసుకోబోయాడు... కానీ ఇంతలో... - man suicide attempted at Hyderabad

చిన్న చిన్న గొడవలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుంటుండగా.. అటు వెళ్లే మరో వ్యక్తి... చూసి అతనిని రక్షించాడు. ఈ ఘటన హైదరాబాద్​ టప్పాచబుత్రా పరిధిలో చోటుచేసుకుంది.

man suicide attempted at Tappachaabutra Hyderabad
ఉరివేసుకోబోయాడు... కానీ ఇంతలో...

By

Published : May 20, 2020, 9:30 AM IST

హైదరాబాద్​ టప్పాచబుత్రా పీఎస్​ పరిధిలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా... మరో వ్యక్తి చూసి ప్రాణాల్ని రక్షించాడు.

అసలేం జరిగిందంటే...

నిన్న రాత్రి మెహబూబ్​ ఫంక్షన్​హాల్​లో రేషన్​ సరకులు తీసుకోవడానికి వచ్చిన అజ్జూ... ఇంటికి వెళ్లే సమయంలో మొఘల్​ నాలా వద్దకు రాగానే అక్కడ చంద్రయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అది గమనించి అజ్జూ... అతనిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంతలో చంద్రయ్య ఉరి వేసుకున్న శాలువ బరువు మోయలేక ఒక్కసారిగా చిరిగి కిందపడ్డాడు.

వెంటనే అజ్జూ అతన్ని కూర్చోబెట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారించగా... కుటుంబ కలహాలే కారణమని చంద్రయ్య తెలిపాడు.

ఇదీ చూడండి.. అప్పుడే అడ్వాన్స్ తీసేసుకున్నారా!

ABOUT THE AUTHOR

...view details