తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫోటోలతో బెదిరించి యువతిని లోబర్చుకున్నాడు' - ACCUSED 22 YEARS SHRAVAN KUMAR

ఓ యువతిని లోబర్చుకుని గర్భవతిని చేసి మోసగించిన యువకుడిపై హైదరాబాద్​ ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూస్తామని సీఐ తెలిపారు.

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రవణ్‌కుమార్​పై కేసు నమోదు

By

Published : Jul 1, 2019, 10:09 PM IST

హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి బయటకు వెళ్లి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన 22ఏళ్ల శ్రవణ్‌కుమార్ వెంటపడి వేధించాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన సమయంలో తీసుకున్న ఫోటోలను చూపించి బెదిరించి గర్భవతిని చేశాడని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కుమార్తె ఆరోగ్య విషయంలో అనుమానం వచ్చిన తండ్రి వైద్య పరీక్షలు చేయించాడని పేర్కొన్నారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూస్తాం : సీఐ
ఆమె గర్భం దాల్చగా..పిండం కడుపులోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని వివరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రవణ్‌కుమార్​పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details