హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్లో భార్యను హతమార్చి, భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతో రూబీన బేగం(30)ను హత్య చేసి... భర్త షబ్బీర్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న బేగంబజార్ పోలీసులు, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నలుగురు చిన్న పిల్లలు అనాథలుగా మారారు. భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు గల కారణాలని పోలీసులు వెల్లడించారు.
భార్యపై అనుమానంతో హత్య... ఆపై భర్త ఆత్మహత్య - man-murdered-his-wife-over-suspicion-then-committed-suicide-himself
భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బేగంబజార్ పీఎస్ పరిధిలోని పటేల్‌నగర్‌లో చోటుచేసుకుంది.
భార్యపై అనుమానంతో హత్య... ఆపై భర్త ఆత్మహత్య