భార్యను నరికి చంపి భర్త ఆత్మహత్య - ఏపీ బ్రేకింగ్
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో దారుణం చోటుచేసుకుంది. భార్యను కత్తిపీటతో చంపేసి భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో దంపతుల మధ్య ఘర్షణ దారుణానికి దారితీసింది. భర్త నాగేశ్వరరావు భార్య సత్యవతిపై కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలయిన సత్యవతిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందారు. సత్యవతిపై దాడిచేసి అనంతరం నాగేశ్వరరావు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా నాగేశ్వరరావు మానసికస్థితి సరిగాలేదని, అనారోగ్యంతో మందులు వాడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.