తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది' - తన బిడ్డ చనిపోయిందంటూ

మలక్ పేట ఏరియా ఆసుపత్రి పరిసరాల్లో స్థానికంగా ఉంటున్న సబా ఫిర్దోసా అనే మహిళ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ చనిపోయిందంటూ మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది'

By

Published : Jul 18, 2019, 8:03 PM IST

నిన్న అర్థరాత్రి మలక్ పేట ఏరియా ఆసుపత్రి పరిసరాలల్లో స్థానికంగా ఉంటున్న సబా ఫిర్దోసా అనే మహిళ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ చనిపోయిందంటూ మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 16నే సబా ఫిర్దోసాను కోఠీ మెటర్నిటీ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా చెప్పినప్పటికీ...ఆసుపత్రిలో విపరీతమైన క్యూ లైన్ల కారణంగా తాము ఆస్పత్రికి వెళ్లలేకపోయామని... అయితే 17న రాత్రి నొప్పులతో తన భార్యని తిరిగి మలక్ పేట ఆసుపత్రికి తీసుకువచ్చినా వైద్యులు సరిగా స్పందించలేదన్నారు.

'వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది'

ABOUT THE AUTHOR

...view details