హైదరాబాద్‌లో మాల మహానాడు ఆందోళనకు దిగింది. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీరును నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. మంత్రి పదవి నుంచి కిషన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని చెన్నయ్య ఆరోపించారు.
హైదరాబాద్‌లో మాల మహానాడు ఆందోళన - bjp
ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ.... మాల మహానాడు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. తక్షణమే మంత్రి పదవి నుంచి కిషన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేసింది.
నినాదాలు చేస్తున్న మాల మహానాడు సభ్యులు