తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​పై న్యాయపోరాటానికి సిద్ధం'

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్​ చేశారు. ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

By

Published : Aug 28, 2020, 3:12 PM IST

mala mahanadu leaders protested in hyderabad
ఉపకులాల వర్గీకరణను ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలి:చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్​ను ఆయన తప్పుబట్టారు. ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం ముందు మాలమహానాడు నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపకులాల వర్గీకరణ అధికారం ఇస్తే ఓటు బ్యాంకు కోసం వారు దుర్వినియోగం చేస్తారని చెన్నయ్య ఆరోపించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కోసం రిజర్వేషన్లు తెస్తే రాజకీయ నాయకులు స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో 'ఛలో దిల్లీ' కార్యక్రమం చేపట్టడంతో పాటు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని చెన్నయ్య స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు

ABOUT THE AUTHOR

...view details