Makara Sankranti Festival 2024 :ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. రంగవల్లికల పండుగ సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోపూజలు ఇలా మూడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దానధర్మాలు సైతం అధికంగానే చేస్తారు. మహాభారత కాలం నుంచే దీనిని జరుపుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పవచ్చు. భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామిని చేసేవే.
సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా సర్కార్ ప్లాన్ - రేపటి నుంచి 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్
సూర్యుడు ప్రతినెలా ఒక్కో కార్తెలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. భానుడు ఒకవైపు నుంచి మరోవైపుకి మారడం వల్ల వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఈ నెలతో శీతాకాలం దాదాపు పూర్తి కాగా ఇప్పటి నుంచి పగలు సమయం పెరిగి, రాత్రి వేళ తగ్గుతుంది. పూర్తిగా ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో ఏటా పెద్దగా మార్పులుండవు.
Makara Sankranti Festival 2024: సంక్రాంతి పండుగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని సూర్యోదయానికి ముందే స్నానాధి కార్యక్రమాలు ముగించి భోగి మంటలు పెడుతారు. ఇంట్లో ఉన్న చెడును మంటలో కాల్చేసి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయడం దీని పరమార్థం. అయితే, భోగి మంటలో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాల్చితే పర్యావరణంలోని హానికర బాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున పంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు.
సంక్రాంతి ఎఫెక్ట్ - పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ
అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం, నువ్వులు కలిపి వండుతారు. వాతావరణానికి తగినట్లు మన శరీరం అలవాటు పడటానికి ఒంట్లో వేడి పెరగటానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. కాబట్టి దీనిని పొంగల్ అని పిలుస్తారు. ప్రతి ప్రాంతంలో బెల్లం, నువ్వులు ఏదో ఒక రూపంలో వంటకాల్లో ఉండేలా చూసుకుంటారు. తెలంగాణలో సకినాలు, ఆంధ్రలో అరిసెలు ప్రత్యేకం.