వనస్థలిపురం @కంటైన్మెంట్ జోన్
> వనస్థలిపురంలోని పలు కాలనీల్లో రేపటి నుంచి కంటైన్మెంట్ జోన్లు అమలు చేయనున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. పలు కాలనీల్లో వారంపాటు ఆంక్షలు.
డిజిటల్ పాసులు
> ఇతర రాష్ట్రాల వారు స్వస్థలాలకు వెళ్లేందుకు డిజిటల్ పాసులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన డీజీపీ.
'ఫీవర్'కి గౌరవం
> హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి సన్మానం. సదరన్ ఆర్మీ వారియర్స్ రాజ్‌పుత్- 19 బెటాలియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.
ఏపీలో మరో 58
> ఏపీలో పెరుగుతున్న కరోనా బాధితులు. తాజాగా 58 కేసులు నమోదయినట్లు వెల్లడించిన ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇకలేరు..
> ఉగ్రవాదులను ఏరివేయడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది శత్రువులు ఉన్నా భయమనేది ఉండదు. ముష్కరుల దాడుల్లో ఎంతో మందిని సైనికులను కాపాడారు. అతడి ధైర్య సాహసాలకు మెచ్చి కేంద్రం 2 సార్లు ప్రతిష్టాత్మక 'శౌర్య' పతకాలను అందించింది. ఆయనే శనివారం జమ్ముకశ్మీర్ హంద్వారాలో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ అశుతోష్ శర్మ.