ఈ సేవలకు ఓకే
లాక్డౌన్ 3.0లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సేవలకు కేంద్రం అనుమతి. అవేంటో తెలుసా...
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ సేవలకు కేంద్రం ఓకే
ఈత కొట్టిన ఎంపీ
మల్లన్నసాగర్ నాలుగో గేట్ ద్వారా విడుదలైన నీటిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈత కొట్టారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకి తోడయ్యారు..
రూ.50కే రైలు టికెట్..
దేశంలో ఎక్కడికెళ్లినా రైలు టికెట్ 50 రూపాయలే. కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం. ఇప్పటికే మార్గదర్శకాలిచ్చాం. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
'
కరోనా' సీజ్
కరోనా హడలెత్తిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వనస్థలిపురంలోని జీవన్‌సాయి ఆసుపత్రిదీ ఇదే తీరు. ఇవాళ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు.
కేటీఆర్ సమీక్ష
కేంద్రం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష. జీహెచ్ఎంసీలో ఆంక్షల సడలింపుపై సమాలోచనలు.
ప్రమాణ స్వీకారం
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.
ప్రభుత్వ వైఖరేంటి?
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ గడవును పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుబోతున్నారు? సర్వత్రా ఉత్కంఠ!