రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి పాటుపడుతోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి... వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన రెండు అంబులెన్సులను ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధులకు రెండువేల రూపాయల పింఛన్ ఇస్తోందని.. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా ఇవ్వలేదని తెలిపారు.
ప్రతిఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి: మంత్రి మహమూద్ అలీ - mahmood ali at nampally
హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ వృద్ధులకోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లను ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలిః మహమూద్ అలీ