తెలంగాణ

telangana

ETV Bharat / state

Gandhi Jayanthi: గాంధీ యంగ్​స్టర్​గా ఎలా ఉండేవారో తెలుసా? - Mahatma Gandhi Jayanthi news

ఒక్కచుక్క రక్తం చిందించకుండా అహింసే మార్గం, సత్యాగ్రహమే ఆయుధంగా దేశాన్ని ఆంగ్లేయుల చెర నుంచి విడిపించిన స్వాతంత్య్ర సమరయోధుడు బాపూజీ (Mahatma Gandhi Jayanthi). ఆ మహానీయుడి జన్మదినం సందర్భంగా జాతికి ఆయన సేవలను స్మరించుకోవడం, ఆయన వ్యక్తిత్వాన్ని, నడిచిన బాటను అనుసరించటమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి. హైదరాబాద్ శిల్పారామంలో మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో ఛాయా ప్రదర్శన ఏర్పాటు చేసి మూడు రోజులపాటు నగరవాసుల సందర్శనకు అవకాశం ఇవ్వనున్నారు.

Mahatma Gandhi
జాతిపిత జీవిత విశేషాలు

By

Published : Oct 2, 2021, 6:40 AM IST

దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో... జాతి నిర్మాణానికి పాటుపడ్డ మహానీయులను స్మరించుకునేందుకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadika Amruth Mahotsav) వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. భారత సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పారామంలో జాతిపిత మహాత్మా గాంధీ జీవిత (Mahatma Gandhi) విశేషాలను ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా ఆవిష్కరించారు.

అరుదైన ఘట్టాలు...

గాంధీజీ బాల్యం నుంచి స్వాతంత్య్ర సంగ్రామం వరకు అరుదైన ఘట్టాలను ప్రముఖంగా ప్రదర్శించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనను ఎమ్మెల్సీ వాణిదేవి (Mlc Vanidevi) ప్రారంభించారు. ప్రదర్శనలో భాగంగా బుక్‌ఫెయిర్ , సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాపూజీ జీవనం, ఆయన పోరాటం, ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్సీ వాణీదేవి (Mlc Vanidevi) కొనియాడారు. విద్యార్థులు, యువత ప్రదర్శన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని సూచించారు.

మూడురోజులపాటు..

నేటితరానికి తెలియని గాంధీజీ (Mahatma Gandhi) జీవితవిశేషాలు, స్వాతంత్ర పోరాటఘట్టాలను... ఛాయాచిత్రాల ప్రదర్శనలో కళ్లకుకట్టారని సందర్శకులు అభిప్రాయపడ్డారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన మహనీయులను గుర్తు చేసుకోవడమే ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మూడురోజులపాటు జరగనున్న ప్రదర్శన ఎంతో విజ్ఞానాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Gandhi Jayanti: 'సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతం'

ABOUT THE AUTHOR

...view details