రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు.... విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణకు చెందిన మధ్యప్రదేశ్ పౌరసబంధాల కార్యదర్శి నరహరి స్పందించారు. పరీక్షలో ఫెయిల్ అయ్యామని కుంగిపోవాల్సిన అవసరం లేదని, ఒకసారి పరీక్షలు తప్పితే మళ్లీ రాయొచ్చని సూచించారు. ఇంటరే జీవితం కాదని జీవితంలో ఎదగడానికి ఇదొక నిచ్చెనలా మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకోని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ.. వారికి నచ్చజెప్పాలన్నారు. మున్ముందు ఇంకా ఏం సాధించాలనే విషయాల గురించి ఆలోచించాలని నరహరి విద్యార్థులకు సూచించారు.
పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చు జీవితం మాత్రం తిరిగిరాదు - MP IAS
పరీక్షలు తప్పితే జీవితం తప్పినట్టు కాదని తెలంగాణకు చెందిన మధ్యప్రదేశ్ పౌరసబంధాల కార్యదర్శి నరహరి తెలిపారు. మార్చి పోతే మేలో మళ్లీ పరీక్షలు రాయొచ్చని కానీ ఒకసారి చనిపోతే మరో జీవితం రాదని చెప్పారు.
పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చు జీవితం మాత్రం తిరిగిరాదు