చికిత్స పొందుతున్న మధులిక ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రేమోన్మాది భరత్‌ను కఠినంగా శిక్షించాలని మధులిక కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని యశోద ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.