తెలంగాణ

telangana

ETV Bharat / state

మధులిక కోలుకుంది - yashoda hospitals

ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన మధులిక ఆరోగ్యం కుదుటపడింది. మధ్యాహ్నం 12గంటలకు ఆమెను డిశ్చార్జ్ చేస్తామని యశోద వైద్యులు తెలిపారు.

కోలుకున్న మధులిక

By

Published : Feb 20, 2019, 11:15 AM IST

Updated : Feb 20, 2019, 12:37 PM IST

కోలుకున్న మధులిక

ఈనెల 6న కళాశాలకు వెళ్తుండగా.. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక కోలుకుంది. మలక్ పేట యశోద ఆసుపత్రిలో 2 వారాల చికిత్స అనంతరం.. సాధారణ స్థితికి చేరుకుంది.

ప్రేమోన్మాది భరత్ కొబ్బరిబోండాల కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. మధులికను రక్షించేందుకు వైద్యులు పలుమార్లు శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వచ్చింది. గాయాలకు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ప్రత్యేక బృందం చికిత్స అందించింది.

మధులిక చికిత్స ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5లక్షల రూపాయలు మంజూరు చేసింది. బాధితురాలు త్వరగా కోలుకోవాలని మహిళా సంఘాలు, విద్యార్థినులు కోరుకుంటూ ర్యాలీలు చేయడం విశేషం.

మొత్తంమీద మధులిక ఆరోగ్యం కుదుటపడటంతో.. ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేయనున్నట్లు యశోద వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:ప్రమాదంలో చిన్నారి మృతి

Last Updated : Feb 20, 2019, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details