తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్పపీడనంగా వాయుగుండం.. 23వ తేదీకి తీరందాటే అవకాశం - ఏపీలో వాయుగుండం ప్రభావం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈనెల 23 నాటికి ఇది తీవ్ర వాయుగండంగా మారి.. బంగ్లాదేశ్-పశ్చిమబెంగాల్ సమీపంలోని సాగర్ దీవులు, ఖేపుపారా వద్ద తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు పేర్కొంది.

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈనెల 23నాటికి తీరం దాటే అవకాశం
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈనెల 23నాటికి తీరం దాటే అవకాశం

By

Published : Oct 22, 2020, 7:09 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్​కు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, సాగర్ దీవులకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపునకు వెళ్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి ఈనెల 23 నాటికి తీవ్ర వాయుగుండంగా మారి.. బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ సమీపంలోని సాగర్ దీవులు, ఖేపుపారా వద్ద తీరం దాటే అవకాశముందని స్పష్టం చేసింది.

దీని ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు పేర్కొంది. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించింది.

ఇదీ చదవండిఃపాతబస్తీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం

ABOUT THE AUTHOR

...view details