తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమ పోరాటం

బట్టల దుకాణంలో మొదలైన పరిచయం కాస్తా... ప్రేమగా మారింది. 8 నెలలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి అసలు కథ మొదలైంది. పోలీసులు, రాజకీయ నాయకులతో రసవత్తరంగా మారింది.

నాకు న్యాయం చేయండి..!

By

Published : Feb 16, 2019, 6:14 PM IST

Updated : Feb 17, 2019, 12:00 AM IST

నాకు న్యాయం చేయండి..!
ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ... హైదరాబాద్​ నల్లకుంటలోని హరీశ్వర్​ రెడ్డి ఇంటి ముందు ఓ అమ్మాయి ఆందోళనకు దిగింది. 8 నెలలుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని.. తీరా పెళ్లి చేసుకొమ్మంటే ముఖం చాటేశాడని యువతి కన్నీటి పర్యంతమైంది.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజకీయ నాయకులతో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించింది.తనకు న్యాయం చేసే వరకు నిరసన కొనసాగిస్తానని ఆమె భీష్మించుకు కూర్చుంది. రంగంలోకి దిగిన పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకు వినకపోవటంతో బలవంతంగా పోలీస్​స్టేషన్​కి తరలించారు.
Last Updated : Feb 17, 2019, 12:00 AM IST

ABOUT THE AUTHOR

...view details