హైదరాబాద్‌కి చెందిన వాణి, మారేడ్‌పల్లికి చెందిన జెర్రీలు ఒకే కంపెనీలో సాప్ట్వేర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అలా ఏర్పడిన స్నేహం ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమయానికి నీ కులం నా కులం వేరంటూ దూరం పెట్టాడు. తనని ఎలాగైనా వదిలించుకోవాలని నీకు వేరే వాడితో సంబంధముందంటూ వాణిని తీవ్రంగా వేధిస్తున్నాడు జెర్రీ.
కథ సుఖాంతం
మోసాన్ని గ్రహించిన బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పెళ్లంటూ చేసుకుంటే జెర్రీనే చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది. జెర్రీ గతంలో కూడా కొంత మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశాడని స్థానికులు చెబుతున్నారు. మహిళా సంఘాలు, పోలీసులు వచ్చి సమాచారం సేకరించారు. జెర్రీ వాళ్ల పెద్దమ్మ వచ్చి తనే దగ్గరుండా పెళ్లి జరిపిస్తానని హామీ ఇవ్వడంతో వాణి ఆందోళన విరమించింది.
పెళ్లి చేసుకోవాలంటూ.. ప్రియుడి ఇంటి ముందు ధర్నా ఇవీ చూడండి: 10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య