సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఓ గదిలో పొందుపరిచిన కిరాణా సామగ్రి, ప్లాస్టిక్ వస్తుల పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కోటి రూపాయల విలువైన సామగ్రి కాలిపోయినట్లు ఇంటి యజయాని వెల్లడించారు. పొగలు కమ్ముకోవడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
కిరాణాలో పేలిన సిలిండర్.. రూ.కోటి నష్టం - fire
సికింద్రాబాద్ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన వల్ల సుమారు కోటి రూపాయల విలువ చేసే కిరాణ సామగ్రి దగ్ధమైంది.
సిలిండర్ పేలి కోటి రూపాయల ఆస్తి నష్టం