తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ లారీ డ్రైవర్ ​లేకుండానే దూసుకెళ్లింది - addagutta

డ్రైవర్​ లేకున్నా ఓ లారీ నడిరోడ్డుపై దూసుకొచ్చింది. ఘటనలో లారీ కింద ఓ ద్విచక్రవాహనం నుజ్జనుజ్జయింది. సికింద్రాబాద్​ అడ్డగుట్టలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.

lorry-move-without-driver

By

Published : May 3, 2019, 2:24 PM IST

సికింద్రాబాద్​లోని అడ్డగుట్టలో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్​ లేని ఓ లారీ దూసుకొచ్చిన ఘటనలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. ఎత్తైన ప్రాంతంలో వాహనం నిలపడం వల్ల లారీ డ్రైవర్​ లేకుండానే పది అడుగుల మేర ముందుకెళ్లింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ప్రమాద ఘటనలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న తుకారాం గేట్​ పోలీసులు లారీ డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు.

ఈలారీలో డ్రైవర్​ లేడు

ABOUT THE AUTHOR

...view details