తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనా? - ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి

అతులిత బలశాలి అంజనీపుత్రుడు ఆంజనేయుడి జన్మస్థలం ఏది? హనుమంతుడు ఎక్కడి వారు? హనుమంతుడు ఎప్పుడు, ఎక్కడ పుట్టారు? ఈ ప్రశ్నలకు తార్కిక సమాధానం చెప్తామంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం.! శ్రీరామనవమి వేడుకల్లో ఆధారాలతో సహా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంతకీ తితిదే వద్ద ఉన్న ఆధారాలేంటి? పురాణాల్లో ఏముంది? శాసనాలు ఏం చెప్తున్నాయి.!

tirumala
తిరుమల

By

Published : Apr 21, 2021, 7:48 AM IST

క‌లియుగ ప్రత్యక్ష దైవ‌ం వెంక‌టేశ్వర‌స్వామి కొలువైన తిరుగిరుల్లోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించేందుకు తితిదే సిద్ధమైంది. ఇందుకోసం పెద్ద కసరత్తే చేసింది. గతేడాది డిసెంబర్‌లో జాతీయ సంస్కృత విశ్వవిద్యాల‌యం, ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం ఉప కుల‌ప‌తులు, ఎస్వీ వేద ఆధ్యయ‌న సంస్థ ప్రత్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మ సహా పలువురితో కమిటీ వేసింది. శివ‌, బ్రహ్మ, బ్రహ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్య గ్రంథాల ప్రకారం శ్రీ వేంక‌టేశ్వరస్వామివారి చెంత గ‌ల అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మస్థాన‌మ‌ని కమిటీ నిర్థరించింది.

ఆకాశగంగ తీర్థంలో తపస్సు...

త్రేతాయుగంలో తిరుమల సప్తగిరుల్లో అంజనాద్రిని ప్రస్తావించారని, భావిశోత్తర పురాణం మొదటి అద్యాయం 79వ శ్లోకంలో హనుమ జన్మస్థలం, జన్మరహస్యం గురించి వివరాలున్నట్లు పండితులు చెప్తున్నారు. అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చినందునే వెంకటాద్రికి అంజనాద్రి అని పేరొచ్చిందన్నది వారి వాదన. మాతంగి మహర్షి సూచన మేరకు నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారని ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తిన్న అంజనాదేవి ఆకాశగంగ తీర్థం సమీపంలో హనుమంతునికి జన్మనిచ్చినట్లు ద్వాదశ పురాణంలో ఉందంటున్నారు.

ఆలయ అభివృద్ధికి మరో కమిటీ...

అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానంగా అధికారికంగా ప్రకటించిన తర్వాతజాపాలి ప్రాంతంలోని ఆంజనేయుడి ఆలయ అభివృద్ధికి తితిదే మరో కమిటీ ఏర్పాటు చేయనుంది.

ఇవీ చదవండి:నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details