ముదిమి వయసులోనూ... పేద ప్రజలకు ఏదో సేవ చేయాలని తలచిన వృద్ధ జంట... తమ మూలాలున్న దేశానికొచ్చారు. ప్రకృతిని ఆస్వాధించాలన్న వారి కోరికలోనే సేవా మార్గాన్ని వెతుక్కున్నారు. ఏ రోడ్డులోనైనా ప్రయాణించేందుకు ప్రత్యేకంగా సౌకర్యవంతమైన ఓ త్రిచక్ర వాహనాన్ని తయారు చేయించుకుని మరీ... నగరాలను చుట్టేస్తున్నారు. భారత్‌లో గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థ... పాత బట్టలు సేకరించి వాటిని సరికొత్త తరహాలో తయారుచేసి పేద ప్రజలకు అందజేస్తుంది. ఆ సంస్థకు ఆర్థికసాయాన్ని అందించాలనే ఉద్దేశంతో భారత్‌లో త్రిచక్ర వాహనంతో సాహసయాత్రకు సిద్ధమయ్యారు లండన్‌కు చెందిన అలెన్ దంపతులు.
రూ.6 కోట్లతో ప్రత్యేక వాహనం...
లండన్‌లో వ్యాపారవేత్త అయిన అలెన్ బ్రాత్ వేట్, అతని భార్య పాట్తో కలిసి నాలుగు రోజుల క్రితం ముంబయి చేరుకున్నారు. 2018లో మోర్గాన్ సంస్థకు చెందిన ఓ పాతకారును రూ.6 కోట్లతో సరికొత్త త్రిచక్రవాహనంగా తయారు చేయించారు. ఏ రహదారిలోనైనా సులభంగా ప్రయాణించేలా వాహనాన్ని తయారు సిద్ధం చేసుకుని భారత్ రోడ్లపై దూసుకుపోతున్నారు.
5,600 కిలోమీటర్లు చుట్టేసేలా...