కరోనా మహమ్మారి దెబ్బకి సూక్ష్మ పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. కార్మికుల కొరత, పెట్టుబడి లేమితో పరిశ్రమలు సతమతవుతున్నాయి. కొత్త ఆర్డర్లు రాకపోవటంతో ఆర్థిక భారం పెరుగుతుందని నిర్వహకులు చెబుతున్నారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన రుణాలు సైతం అందట్లేదని ఆవేదన చెందారు. మెుండి బకాయిలు సైతం పెరగటం వల్ల పరిశ్రమలపై ఆర్థిక భారం పడుతోంది.
ఆ దెబ్బకి ఇబ్బందుల్లో పడ్డ సూక్ష్మ పరిశ్రమలు - కరోనా మహమ్మారి సూక్ష్మ పరిశ్రమల ఇబ్బందులు
కరోనా మహమ్మారి సూక్ష్మ పరిశ్రమలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే కార్మికుల కొరత, పెట్టుబడి లేమితో సతమతమవుతున్న పరిశ్రమలకు.. కొత్త ఆర్డర్లు రాకపోవటం వల్ల మరింత భారంగా మారింది. మెుండి బకాయిలు సైతం పేరుకుపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సంక్షోభ పరిస్థితుల నడుమ పరిశ్రమ కోలుకోవటం.. పునర్ వైభవంపై మదనపడుతున్న బాలానగర్ పారిశ్రామిక వాడలోని సూక్ష్మ పరిశ్రమల నిర్వహకులతో ఈటీవీ ముఖాముఖి.
ఆ దెబ్బకి ఇబ్బందుల్లో పడ్డ సూక్ష్మ పరిశ్రమలు
కరోనా వల్ల కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారని నిర్వహకులు చెబుతున్నారు. కేవలం 50 శాతం మందితో పరిశ్రమలు నడుపుతున్నామని వారు అంటున్నారు. పరిశ్రమలు భౌతిక దూరం పాటిస్తూ సిబ్బంది పనులు చేస్తున్నారని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి :'గంధమల్లకు నీళ్లు వస్తే.. కేసీఆర్కు పాలాభిషేకం చేస్తా'